Header Banner

ట్రంప్ వెనక్కి తగ్గినా ఆర్థిక నష్టం తప్పలేదా..! అమెరికా క్షీణత ప్రారంభమైంది!

  Thu May 01, 2025 11:13        U S A

అమెరికా అధ్యక్షుడు ఒకటనుకుంటే మరొకటి జరుగుతున్నట్లుంది. సుంకాల అమలుపై వెనక్కి తగ్గినా ఆలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయినట్లు కనిపిస్తోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో భారీ క్షీణత కనిపించింది. సుంకాల అమలు ప్రకటనతోనే అంతా జరిగింది. దీంతో మాంద్యం దిశగా అమెరికా పయణిస్తోంది. మాంద్యం తప్పకపోవచ్చనే సంకేతాలు ఇస్తోంది. ఆ వివరాలు ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

 

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే తనదైన మార్క్ చూపిస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. అమెరికానే తన తొలి ప్రాధాన్యం అంటూ పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. భారత్ సహా ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తామని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులకు కారణమైంది. తాము తీసుకునే నిర్ణయాలు అమెరికాకు మేలు చేస్తాయని ట్రంప్ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నా క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ట్రంప్ ఒకటి తలిస్తే మరొకటి జరుగుతోంది. దేశీయంగా తయారీని ప్రోత్సహించి అమెరికా ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడమే లక్ష్యమని చెబుతున్న ట్రంపునకు అన్ని వైపుల నుంచి షాకులే తగులుతున్నాయి.

 

భారీ స్థాయిలో ప్రతీకార సుంకాలు విధించడంతో అది ప్రతికూల ప్రభావం చూపుతుందన్న పరిశ్రమ వర్గాల ఆందోళనలతో ట్రంప్ వెనక్కి తగ్గారు. సుంకాల అమలను 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. వాణిజ్య చర్చలకు తాము సిద్ధమని ప్రకటించారు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సుంకాలు పెరిగితే ధరలు భారీగా పెరిగుతాయన్న అంచనాలతో టారిఫ్‌లు అమలులోకి రాకముందే విదేశీ వస్తువులను కంపెనీలు భారీగా దిగుమతి చేసుకున్నాయి. దీంతో వాణిజ్య లోటు భారీగా పెరిగిపోయింది. విదేశీ వస్తువులు ఒక్కసారిగా దిగుమతి కావడంతో అది అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపించింది.

 

ఇది కూడా చదవండిఏపీకి రూ.172 కోట్లతో మరో కొత్త మాల్! ఆ నగరంలో ఫిక్స్..!

 

అమెరికా ఆర్థిక వ్యవస్థ 2025 జనవరి- మార్చి త్రైమాసికంలో 0.3 శాతం మేర క్షీణించింది. గడిచిన మూడేళ్లలో చూసుకుంటే ఇలా భారీగా క్షీణించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. విదేశీ వస్తువులు ఒక్కసారిగా దేశంలోకి దిగుమతి కావడంతోనే ఇందుకు నేపథ్యంగా ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. అంతకు ముందు 2024 చివరి మూడు నెలల్లో చూసుకుంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ 2.4 శాతం వృద్ధి సాధించింది. అయితే, ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోందని చెబుతున్నారు. ఆ తర్వాతి మూడు నెలలు (జనవరి- మార్చి) 0.3 శాతం మేర తగ్గడమే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే మాంద్యం తప్పకపోవచ్చని హెచ్చరిస్తున్నారు.

 

వరుసగా రెండు త్రైమాసికాల్లో ఆర్థిక వృద్ధి నెగెటివ్‌లో నమోదు అయితే ఆర్థిక మాంద్యంగా పరిగణిస్తారు. ప్రస్తుతం అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా క్షీణించడంతో మాంద్యం భయాలు మరింత కమ్ముకున్నాయి. అయితే, ట్రంప్ సుంకాలకు బ్రేకులు వేసిన క్రమంలో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో పుంజుకోవచ్చనే వాదనలూ ఉన్నాయి. చూడాలి మరి ఈ త్రైమాసికంలో ఎలా ఉంటుందో.

 

ఇది కూడా చదవండిప్లాట్ కొనుగోలుదారులకు భారీ ఊరట..! రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గించిన ఏపీ ప్రభుత్వం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

 

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!

 

6 లైన్లుగా రహదారిడీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #USRecession #TrumpTariffs #EconomicSlowdown #USAEconomyCrisis #TradeDeficit